Magunta Sreenivasulu Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు

ED raids in YSRCP MP Magunta Sreenivasulu Reddy residences in Delhi and Nellore
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్
  • ఐదు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ
  • మాగుంటకు చెందిన నెల్లూరు, ఢిల్లీ నివాసాల్లో కొనసాగుతున్న సోదాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ నుంచి వెళ్లిన ఈడీ అధికారులు ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. దాదాపు 40కి పైగా లొకేషన్లలో రెయిడ్స్ కొనసాగుతున్నాయి. హైదరాబాదులో 20 చోట్ల సోదాలు జరుగుతుండగా... ఏపీలోని నెల్లూరులో కూడా రెయిడ్స్ జరుగుతున్నాయి. వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన నెల్లూరులోని నివాసంతో పాటు, ఢిల్లీ నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. 

ఈ స్కామ్ లో మాగుంటపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలోని వైన్ షాపుల్లో కొన్నింటిని మాగుంటకు చెందిన లిక్కర్ కంపెనీలు చేజిక్కించుకున్నాయని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాగుంట నివాసాల్లో సీబీఐ సోదాలను నిర్వహించింది. మరోవైపు మాగుంటతో పాటు మరికొందరు నేతల హస్తం కూడా ఈ స్కాంలో ఉందని ఈడీ ఆరోపిస్తోంది. త్వరలోనే వీరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెపుతున్నారు.
Magunta Sreenivasulu Reddy
YSRCP
MP
Delhi Liquor Scam
Enforcement Directorate
Raids

More Telugu News