నాగచైతన్య, సమంత విడాకులపై నాగార్జున తాజా వ్యాఖ్యలు

  • 2017లో పెళ్లితో ఒక్కటైన నాగచైతన్య, సమంత
  • కొన్నాళ్లకే విడిపోయిన జంట
  • ఇప్పుడు చైతూ హ్యాపీగా ఉన్నాడన్న నాగార్జున
  • అంతకంటే తానేమీ కోరుకోనని వెల్లడి
Nagarjuna comments on Nagachaitanya and Samantha divorce

అక్కినేని నాగచైతన్య, సమంత జోడీ విడిపోయి చాలాకాలం అయినా ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. వారు ఎందుకు విడిపోయారన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో, జాతీయ మీడియా సంస్థ 'పింక్ విల్లా' నాగార్జునను ఈ అంశంపై స్పందించాలని కోరింది. 

అందుకు నాగార్జున స్పందిస్తూ... "నాగచైతన్య ఇప్పుడు హ్యాపీగా కనిపిస్తున్నాడు. నాకది చాలు. అంతకంటే నేను ఇంకేమీ కోరుకోను. గతంలో అతడి జీవితంలో జరిగిన వ్యవహారం అంటారా.... అదొక అనుభవం. దురదృష్టకరమైనది. దాన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోలేం. ఆ వ్యవహారం ముగిసిపోయింది. మా జీవితాల నుంచి తీసేశాం. ఇతరులు కూడా దాని గురించి ఇక ఆలోచించరని భావిస్తున్నాం" అని వ్యాఖ్యానించారు. 

టాలీవుడ్ లో అందాల జంటగా గుర్తింపు పొందిన నాగచైతన్య, సమంత చాలాకాలం పాటు ప్రేమించుకుని, 2017లో పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి గోవాలోని ఓ రిసార్ట్ లో హిందూ పద్ధతిలోనూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం రెండుసార్లు జరిగింది. 

పెళ్లి రిసెప్షన్ కూడా హైదరాబాదులోనూ, చెన్నైలోనూ ఘనంగా నిర్వహించారు. కానీ, కొన్నేళ్ల తర్వాత వీరి కాపురంలో కలతలు బయల్దేరాయి. విభేదాలు తీవ్రరూపు దాల్చడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

More Telugu News