Andhra Pradesh: కేంద్ర మంత్రిని క‌లిసిన జీవీఎల్.. విశాఖ‌లో సీజీహెచ్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేయాల‌ని విన‌తి

bjp mp gvl narasimharao meets union minister Mansukh Mandaviya over cghs in ap
  • కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుక్ మాండ‌వీయ‌తో జీవీఎల్ భేటీ
  • సీజీహెచ్ఎస్ అమ‌లుపై చ‌ర్చ‌
  • ఏపీకి సీజీహెచ్ఎస్ అద‌న‌పు డైరెక్ట‌ర్‌ను నియ‌మించాల‌ని విన‌తి
  • విశాఖ‌లో సీజీహెచ్ఎస్ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయాల‌ని అభ్య‌ర్థ‌న‌
బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు బుధ‌వారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుక్ మాండ‌వీయ‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ హెల్త్ స్కీం(సీజీహెచ్ఎస్‌) అమ‌లుకు సంబంధించి రెండు కీల‌క అంశాల‌ను ఆయ‌న కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో సీజీహెచ్ఎస్ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు అద‌న‌పు డైరెక్ట‌ర్‌ను నియ‌మించాల‌ని, విశాఖ‌లో సీజీహెచ్ఎస్ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న కేంద్ర మంత్రిని కోరారు. 

8 ఏళ్ల క్రితం రాష్ట్ర విభజన జరిగినప్పటికీ, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న తెలంగాణ సీజీహెచ్ఎస్ అద‌న‌పు డైరెక్ట‌రే ఏపీలోని ఆ ప‌థ‌కాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని జీవీఎల్‌ తెలిపారు. ఇతర దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ సీజీహెచ్ఎస్‌ అదనపు డైరెక్టర్లు ఉన్నారని, ఏపీకి మాత్ర‌మే అద‌న‌పు డైరెక్ట‌ర్ లేని విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. ఏపీలో సీజీహెచ్ఎస్‌ కార్యాలయం లేకపోవడం వల్ల ఏపీలోని  రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీజీహెచ్ఎస్‌ సేవలను అందించడంలో విపరీత జాప్యం జరుగుతోందని జీవీఎల్ పేర్కొన్నారు.
Andhra Pradesh
Vizag
BJP
GVL Narasimha Rao
CGHS
Mansukh Mandaviya

More Telugu News