Team India: గాయం నుంచి కోలుకుంటున్న జడేజా... ఫొటో ఇదిగో

team india all rounder ravindta jadeja reaches home after treatment
  • ఆసియా క‌ప్ సిరీస్‌లో గాయ‌ప‌డ్డ జ‌డేజా
  • గాయంతో టీ20 వ‌రల్డ్ క‌ప్‌న‌కూ దూర‌మైన ఆల్ రౌండ‌ర్‌
  • ఆసుప‌త్రి నుంచి ఇంటికి చేరిన క్రికెట‌ర్‌
  • గాయం నుంచి కోలుకుంటున్న‌ట్లు వెల్ల‌డి
ఆసియా క‌ప్ సిరీస్‌లో మోకాలి గాయానికి గురైన టీమిండియా ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా గాయం నుంచి కోలుకుంటున్నాడు. మోకాలి గాయం కార‌ణంగా ఆసియా క‌ప్ మ‌ధ్య‌లోనే నిష్క్ర‌మించిన జ‌డేజా... త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న టీ20 వ‌రల్డ్ క‌ప్‌న‌కు కూడా దూర‌మైన సంగ‌తి తెలిసిందే. మోకాలి గాయానికి చికిత్స నిమిత్తం ఆసుప‌త్రిలో చేరిన జ‌డేజా...త‌న కాలికి ఆప‌రేష‌న్ కూడా చేయించుకున్నాడు. 

ఈ సందర్భంగా కొన్ని రోజుల క్రితం ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటోను షేర్ చేసిన జ‌డేజా... తాజాగా ఆసుప‌త్రి నుంచి ఇంటికి చేరుకున్న‌ట్టుగా ప్ర‌క‌టించాడు. ఇంటిలో గాయం నుంచి కోలుకుంటున్న వైనాన్ని తెలుపుతూ బుధ‌వారం జ‌డేజా త‌న ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.
Team India
Cricket
Ravindra Jadeja

More Telugu News