Millionaires: ప్రపంచంలో కోటీశ్వరులు అత్యధికంగా ఉన్న నగరాలు ఇవే!

  • నివేదిక రూపొందించిన హెన్లీ అండ్ పార్ట్ నర్స్
  • న్యూయార్క్ లో అత్యధిక సంఖ్యలో మిలియనీర్లు
  • టాప్-10లో ఐదు అమెరికా నగరాలు
  • రెండో స్థానంలో టోక్యో
These cities have most number of millionaires in the world

తాజాగా హెన్లీ అండ్ పార్ట్ నర్స్ గ్రూప్ రూపొందించిన నివేదికలో సంపన్నులకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటీశ్వరుల్లో అత్యధికులు నగరాల్లోనే నివసిస్తున్నారట. అది కూడా కొన్ని నగరాలే మిలియనీర్లతో తులతూగుతున్నాయట. ఈ మేరకు హెన్లీ అండ్ పార్ట్ నర్స్ అత్యధికంగా కోటీశ్వరులు ఉన్న టాప్-10 నగరాల జాబితా రూపొందించింది. 

న్యూయార్క్ మహానగరంలో అత్యధిక సంఖ్యలో కోటీశ్వరులు నివసిస్తున్నారు. న్యూయార్క్ లో 3,45,600 మంది మిలియనీర్లు, 59 మంది బిలియనీర్లు ఉన్నట్టు వెల్లడైంది. ఆ తర్వాత స్థానాల్లో టోక్యో, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్ నగరాలు ఉన్నాయి. ఒక మిలియన్ డాలర్లు, అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగిన ఆస్తులు ఉన్నవారిని మిలియనీర్ ప్రాతిపదికగా తీసుకుని హెన్లీ అండ్ పార్ట్ నర్స్ గ్రూప్ ఈ నివేదిక రూపొందించింది. టాప్-10లో సగం అమెరికా నగరాలే ఉన్నాయి.

టాప్-10 నగరాల జాబితా...

1. న్యూయార్క్- 3,45,600 మిలియనీర్లు, 59 బిలియనీర్లు
2. టోక్యో- 3,04,900 మిలియనీర్లు, 12 బిలియనీర్లు
3. శాన్ ఫ్రాన్సిస్కో- 2,76,400 మిలియనీర్లు, 62 బిలియనీర్లు
4. లండన్- 2,72,400 మిలియనీర్లు, 38 బిలియనీర్లు
5. సింగపూర్- 2,49,800 మిలియనీర్లు, 26 బిలియనీర్లు
6. లాస్ ఏంజెలిస్- 1,92,400 మిలియనీర్లు, 34 బిలియనీర్లు
7. షికాగో- 1,60,100 మిలియనీర్లు, 28 బిలియనీర్లు
8. హూస్టన్- 1,32,600 మిలియనీర్లు, 25 బిలియనీర్లు
9. బీజింగ్- 1,31,500 మిలియనీర్లు, 44 బిలియనీర్లు
10. షాంఘై- 1,30,100 మిలియనీర్లు, 42 బిలియనీర్లు

More Telugu News