Hyderabad: హైద‌రాబాద్‌లో అమెరికా కాన్సుల్ జ‌న‌ర‌ల్‌గా జెన్నిఫ‌ర్ లార్స‌న్ బాధ్య‌తల స్వీకారం

Jennifer Larson takes charge as US Consul General in Hyderabad
  • ఇటీవ‌లే హైద‌రాబాద్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్‌గా నియ‌మితులైన జెన్నిఫ‌ర్‌
  • మంగ‌ళ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించిన వైనం
  • తెలంగాణ‌, ఏపీ, ఒడిశా వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న కార్యాల‌యం
అగ్ర రాజ్యం అమెరికాకు చెందిన హైద‌రాబాద్ కార్యాల‌యం (యూఎస్ కాన్సులేట్‌ జ‌న‌ర‌ల్ ఆఫీస్‌) చీఫ్‌గా జెన్నిఫ‌ర్ లార్స‌న్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఆమె మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జ‌న‌రల్ కార్యాల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు కార్యాల‌య సిబ్బంది ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న యూఎస్‌ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యం... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల‌కు సంబంధించి అమెరికా దౌత్య కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Hyderabad
Telangana
Andhra Pradesh
Odisha
Jennifer Larson
US Consul General

More Telugu News