ష‌ర్మిల‌పై ఫిర్యాదు వ్య‌వ‌హారంలో తెలంగాణ స్పీక‌ర్ స్పంద‌న ఇదే

  • ష‌ర్మిల‌పై ఫిర్యాదు చేసిన న‌ల్ల‌గొండ, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల ఎమ్మెల్యేలు
  • ఫిర్యాదు అందింద‌న్న స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి
  • స‌భ్యుల గౌర‌వం కాపాడాల్సిన బాధ్య‌త స్పీక‌ర్‌గా నాపై ఉందన్న స్పీక‌ర్‌
  • ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ చేప‌ట్టి త‌గిన చర్య‌లు తీసుకుంటాన‌ని వెల్ల‌డి
ts assembly speaker respomnds on a complaint on ys sharmila

పాద‌యాత్ర‌లో భాగంగా వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల త‌మ‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ త‌మ ప్రతిష్ఠ‌కు భంగం క‌లిగిస్తున్నారంటూ ప‌లువురు ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదుపై తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి మంగ‌ళ‌వారం రాత్రి స్పందించారు. ష‌ర్మిల‌పై త‌న‌కు ప‌లువురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన మాట నిజ‌మేన‌ని ఆయ‌న తెలిపారు. అసెంబ్లీ స్పీక‌ర్‌గా స‌భ్యుల గౌర‌వాన్ని కాపాడాల్సిన బాధ్య‌త త‌న‌పై ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ వ్యవ‌హారంపై విచార‌ణ చేప‌ట్టి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ష‌ర్మిల త‌మ‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నారంటూ న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల‌కు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News