ఈ వారం ఎనిమిది సినిమాల రిలీజ్ .. ఆ రెండింటిపైనే ఎక్కువ ఆసక్తి!

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Update
  • ఈ నెల 15న వస్తున్న శింబు 'ముత్తు'
  • 16వ తేదీన 7 సినిమాల రిలీజ్ 
  • కన్నడ అనువాదంగా బరిలోకి సుదీప్ సినిమా 
  • సుధీర్ - కిరణ్  సినిమాలకి మాత్రమే ఉన్న బజ్
ఈ నెల 16వ తేదీన థియేటర్లలో దిగుతున్న సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆ రోజున సుధీర్ బాబు -  కృతి శెట్టి కాంబినేషన్లోని 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా విడుదలకి ఉంది. మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఆ తరువాత సినిమాగా కిరణ్ అబ్బవరం 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' కనిపిస్తోంది. 

ఇక ఆ తరువాత వరుసలో 'శాకిని డాకిని' .. 'సకల గుణాభిరామా' .. నేను నువ్వు' .. 'అం అః' సినిమాలు ఉన్నాయి. 'శాకిని డాకిని' గురించి తప్ప మిగతా సినిమాలను గురించి జనాలకు పెద్దగా తెలియదు. వాటిపై ఎలాంటి బజ్ లేదు. ఈ సినిమాలు ఎవరు తీశారు .. ఎవరు చేశారనే విషయం కూడా చాలామందికి తెలియదు.

ఈ శుక్రవారానికి ఒక రోజు ముందుగానే తమిళ అనువాదంగా శింబు 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక శుక్రవారం రోజునే కన్నడ అనువాదంగా సుదీప్ 'K3 కోటికొక్కడు' సినిమా బరిలోకి దిగుతోంది. మౌత్ టాక్ తో ఇవి థియేటర్లకు రప్పించవలసిందే. ప్రస్తుతానికి మాత్రం సుధీర్ బాబు .. కిరణ్ అబ్బవరం సినిమాలపైనే అందరిలో ఆసక్తి ఉంది.
Go Back to Shorts
Sudheer Babu
Krithi Shetty
Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie

More Telugu News