ఈ నెల 26 నుంచి ఏపీలో దసరా సెలవులు
- అక్టోబర్ 6 దాకా దసరా సెలవులు
- క్రిస్టియన్, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్ 1 నుంచి 6 వరకు సెలవులు
- అక్టోబర్ 7న అన్ని పాఠశాలల పునఃప్రారంభం
ఇదిలా ఉంటే.. ఈ నెల 26 నుంచి దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించగా... పాఠశాలలకు మాత్రం 25ననే సెలవులు ప్రారంభం కానున్నాయి. ఎందుకంటే ఈ నెల 25న ఆదివారం కాబట్టి. ఈ సెలవులు సాధారణ పాఠశాలలకు మాత్రమే. క్రిస్టియన్, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్ 1 నుంచి 6 వరకు సెలవులు ఇస్తూ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పాఠశాలలు కూడా ఇతరత్రా పాఠశాలల మాదిరే అక్టోబర్ 7న పునఃప్రారంభం కానున్నాయి. ఇక ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలకు 220 పనిదినాలు, 80 సెలువులుగా ప్రభుత్వం ప్రకటించింది.