Infosys: అలా చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం: ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఇన్ఫోసిస్

  • పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్న ఇన్ఫోసిస్
  • కంపెనీ రూల్స్ ప్రకారం ద్వంద్వ ఉపాధికి అవకాశం లేదని స్పష్టీకరణ
  • ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్స్ పంపిన యాజమాన్యం
Infosys warns employees for doing part time job

తన ఉద్యోగులకు భారతీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అనుమతి లేకుండా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు నిన్న ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపించింది. కంపెనీ నియమావళి ప్రకారం ద్వంద్వ ఉపాధికి అవకాశం లేదని స్పష్టం చేసింది. కంపెనీ నియమాలను ఉల్లంఘించిన వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పింది. 

ద్వంద్వ ఉపాధి అనేది కంపెనీ ఉత్పాదకతపై ప్రభావం చూపుతుందని... డేటా ప్రమాదం, రహస్య సమాచారం లీకేజీ, ఉద్యోగుల పనితీరు తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపింది. మరోవైపు ఇదే అంశంపై విప్రో అధినేత ప్రేమ్ జీ కొన్ని రోజుల క్రితం స్పందించారు. ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేయడం సరికాదని... ఈ పద్ధతి మోసం అని ఆయన అన్నారు.

More Telugu News