Ramcharan: చరణ్ కోసం మలయాళ స్టార్ ను దింపుతున్న శంకర్!

  • షూటింగు దశలో శంకర్ మూవీ
  • చరణ్ కి ఇది 15వ  సినిమా 
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • కీలకమైన పాత్రలో మోహన్ లాల్
shankar and Charan movie update

చరణ్ హీరోగా శంకర్ ఒక భారీ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చరణ్ కి ఇది 15వ సినిమా అయితే, నిర్మాతగా దిల్ రాజుకి ఇది 50వ సినిమా. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. కథానాయికగా కియారా అద్వానీని తీసుకున్నారు. 

ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రకిగాను మోహన్ లాల్ పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ పాత్రకిగాను ఆయననే ఖరారు చేశారనేది తాజా సమాచారం. ఈ సినిమా సెకండాఫ్ లో ఆయన పాత్ర ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. శంకర్ డిఫరెంట్ గా .. పవర్ఫుల్ గా డిజైన్ చేసిన ఈ పాత్ర కోసం మోహన్ లాల్ కి భారీ పారితోషికమే ముట్టిందని చెబుతున్నారు. 

 చరణ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. విలేజ్ నేపథ్యంలో నడిచే పాత్ర ఒకటైతే, సిటీ నేపథ్యంలో స్టైలీష్ గా కనిపించే పాత్ర మరొకటి. ఈ రెండు పాత్రల మధ్య వైవిధ్యం ఈ సినిమాకి హైలైట్ అంటున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

More Telugu News