టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత‌కు క‌రోనా పాజిటివ్‌

12-09-2022 Mon 17:48 | Telangana
  • జ‌లుబుతో వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌న్న క‌విత‌
  • ప‌రీక్ష‌ల్లో క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింద‌ని వెల్ల‌డి
  • త‌న‌ను క‌లిసి వారు పరీక్ష‌లు చేయించుకోవాల‌ని పిలుపు
trs mlc kavitha tests positive for corona
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వ‌కుంట్ల క‌విత క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ మేర‌కు సోమ‌వారం సాయంత్రం ఆమె త‌న సోష‌ల్ మీడియా వేదిక‌ల మీద ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. స్వ‌ల్ప జ‌లుబు ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో తాను క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని... ఈ క్ర‌మంలో త‌న‌కు క‌రోనా సోకిన‌ట్లు తేలింద‌ని ఆమె వెల్ల‌డించారు.

గ‌డ‌చిన రెండు రోజులుగా త‌న‌ను క‌లిసిన వారిలో ఎవ‌రికైనా జ్వ‌రం, జ‌లుబు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. త‌క్ష‌ణ‌మే ఐసోలేష‌న్‌లోకి వెళ్లాల‌ని, క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రిపించుకోవాల‌ని ఆమె కోరారు. క‌రోనా పాజిటివ్‌గా తేల‌డంతో తాను త‌న ఇంట్లోనే ఐసోలేష‌న్‌లో ఉంటూ వైద్య చికిత్స తీసుకుంటున్నాన‌ని ఆమె పేర్కొన్నారు.