Shahid Afridi: ఆసియా కప్ లో దాయాదుల మ్యాచ్ సందర్భంగా తన కుమార్తె భారత జెండా ఊపిందన్న అఫ్రిది

Afridi reveals his daughter waved Indian flag during India and Pakistan match in Asia Cup
  • గత వారం ఆసియా కప్ లో తలపడిన భారత్, పాక్
  • కుటుంబంతో కలిసి మ్యాచ్ వీక్షించిన అఫ్రిది
  • స్టేడియంలో 10 శాతం పాక్ ఫ్యాన్స్ ఉన్నారని వెల్లడి
  • 90 శాతం భారత అభిమానులేనని వివరణ
పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రిది ఎంతటి భారత్ వ్యతిరేకో అందరికీ తెలిసిందే. అలాంటి అతడి నోటి వెంట ఇప్పుడు ఆశ్చర్యకరమైన మాట వినిపించింది. ఆసియా కప్ లో టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా తన కుమార్తె భారత జెండాను చేతబూని రెపరెపలాడించిందని అఫ్రిది వెల్లడించాడు. 

పాకిస్థానీ టెలివిజన్ చానల్ 'సమా' తో మాట్లాడుతూ... ఆ మ్యాచ్ సమయంలో స్టేడియంలో 10 శాతం మంది పాకిస్థాన్ అభిమానులుంటే, 90 శాతం మంది భారత అభిమానులున్నారని తెలిపాడు. 

స్టేడియంలో పెద్దగా పాకిస్థానీ ఫ్యాన్స్ కనిపించడంలేదని తన భార్య కూడా చెప్పిందని, ఊపేందుకు పాకిస్థాన్ జెండాలు దొరక్కపోవడంతో తన చిన్న కుమార్తె భారత జెండా తీసుకుని ఊపిందని అఫ్రిది నవ్వుతూ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా తనకు అందిందని, కానీ దాన్ని ఆన్ లైన్ లో షేర్ చేయొచ్చో, లేదో తెలియదని అన్నాడు.
Shahid Afridi
Daughter
Indian Flag
India
Pakistan
Asia Cup

More Telugu News