YSRCP: దేవుల‌ప‌ల్లి అమ‌ర్ ప‌ద‌వీ కాలాన్ని పొడిగించిన ఏపీ ప్ర‌భుత్వం

ap government extends devulapalli amar tenure for one more year
  • మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా దేవులపల్లి అమర్
  • గ‌తంలో సాక్షి టీవీలో కీల‌క స్థానంలో ప‌నిచేసిన తెలంగాణ జ‌ర్న‌లిస్ట్‌
  • ప‌ద‌వీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసిన సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌
ఏపీ ప్ర‌భుత్వం మ‌రో స‌ల‌హాదారుడి ప‌ద‌వీ కాలాన్ని పొడిగిస్తూ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా ఉన్న దేవులపల్లి అమర్ పదవీ కాలాన్ని మరో సంవత్సరం పొడిగిస్తూ  రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఏపీ సాధార‌ణ ప‌రిపాల‌నా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రేవు ముత్యాల రాజు శ‌నివారం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఏపీ సీఎంగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ప‌లువురిని రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారులుగా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా అప్పటిదాకా సాక్షి టీవీలో కీల‌క స్థానంలో ప‌ని చేస్తున్న తెలంగాణ‌కు చెందిన దేవులప‌ల్లి అమ‌ర్‌ను రాష్ట్ర ప్రభుత్వ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా నియ‌మించారు. తాజాగా ఆయ‌న ప‌ద‌వీ కాలం ముగియ‌నుండ‌టంతో మ‌రో ఏడాది పాటు ఆయ‌న ప‌ద‌వీ కాలాన్ని పొడిగించారు.
YSRCP
Andhra Pradesh
Devulapalli Amar
Advisor to AP

More Telugu News