Venkaiah Naidu: బెజ‌వాడ‌లో వెంక‌య్య‌తో ఆత్మీయ స‌మావేశం... హాజ‌రైన 3 పార్టీల కీల‌క నేత‌లు

3 parties leaders attends venkaiah naidu meeting in vijayawada
  • వెంక‌య్య మిత్రుల ఆధ్వ‌ర్యంలో ఆత్మీయ స‌మావేశం
  • హాజ‌రైన కేశినేని నాని, దేవినేని అవినాశ్, కామినేని శ్రీనివాస్‌
  • ఈ స‌మావేశం త‌న‌కు ఎంత‌గానో ఆనందాన్ని ఇచ్చింద‌న్న వెంక‌య్య‌
భార‌త మాజీ ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడుతో ఆయ‌న స్నేహితులు శ‌నివారం విజ‌య‌వాడ‌లో ఆత్మీయ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఏపీలోని 3 ప్ర‌ధాన పార్టీల‌కు చెందిన కీల‌క నేత‌లు హాజ‌రయ్యారు. టీడీపీకి చెందిన విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, వైసీపీకి చెందిన యువ నేత దేవినేని అవినాశ్, బీజేపీకి చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌లు హాజ‌ర‌య్యారు.

ఈ స‌మావేశంలో మాట్లాడిన వెంక‌య్య‌నాయుడు... ప‌లువురు మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులను క‌ల‌వ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌ని తెలిపారు. చ‌క్క‌టి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించినందుకు ఆయ‌న నిర్వాహ‌కుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వి నుంచి దిగిపోయాక వెంక‌య్య‌తో ఇప్ప‌టికే రాజ‌మహేంద్ర‌వ‌రం, గుంటూరులోని విజ్ఞాన్ విశ్వ‌విద్యాల‌యాల్లో ఆత్మీయ స‌మావేశాలు నిర్వహించిన సంగ‌తి తెలిసిందే.
Venkaiah Naidu
YSRCP
TDP
BJP
Devineni Avinash
Kesineni Nani
Kamineni Srinivas
Vijayawada

More Telugu News