అందరిలో ఆసక్తిని పెంచుతున్న 'యశోద' టీజర్!
- 'యశోద'గా కనిపించనున్న సమంత
- సస్పెన్స్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ఇది
- కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్
- హైలైట్ గా నిలవనున్న మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
స్పెన్స్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో సమంత గర్భవతిగా కనిపిస్తోంది. ఆ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ఆమెకి ఓ లేడీ డాక్టర్ చెబుతూ ఉంటే, అందుకు భిన్నమైన .. భయానకమైన పరిస్థితులను యశోద ఎదుర్కొంటున్నట్టుగా చూపించారు.
యశోదకి అలాంటి పరిస్థితులు ఎందుకు ఎదురయ్యాయి? దానికి కారకులు ఎవరు? అనేవి ఆసక్తిని రేకెత్తించే అంశాలు. సినిమాకి వెళ్లాలనే కుతూహలాన్ని పెంచేలానే ఈ టీజర్ ను కట్ చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి హరి - హరీశ్ దర్శకత్వం వహించారు. వరలక్ష్మి శరత్ కుమార్ .. ఉన్ని ముకుందన్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం హైలైట్ గా నిలవనుంది.