Ileana: డిజిటల్ ఎంట్రీకి ఇలియానా రెడీ

Ileana  to debut in web series with a female led show
షార్ట్స్‌లో చూడండి
పదహారేళ్ల క్రితం ‘దేవదాసు’తో టాలీవుడ్ తెరకు పరిచయమైన నటి ఇలియా డిక్రూజ్. ఆ తర్వాత మహేశ్ బాబు సరసన ’పోకిరి‘తో తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. దక్షిణాదిలో చాన్నాళ్లు అగ్ర నటిగా వెలిగొందిన ఈ గోవా బ్యూటీ తర్వాత డీలా పడింది. యువ హీరోయిన్లతో పోటీలో వెనుకబడి అవకాశాలను తెచ్చుకోలేకపోయింది. ఈ క్రమంలో బాలీవుడ్ లో కాలు పెట్టినా పెద్దగా రాణించలేకపోయింది. అడపాదడపా చిత్రాలు చేస్తున్నా టాప్ హీరోయిన్ల జాబితాలోకి రాలేకపోతోందామె. 

దాంతో, ఇలియానా ఇప్పుడు డిజిటల్ బాట పట్టింది. బాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తున్నారు. ఇప్పుడు ఇలియానా కూడా ఈ జాబితాలో చేరింది. ఇప్పుడు డిజిటల్ అరంగేట్రానికి రెడీ అయ్యింది. నాయికా ప్రాధాన్యం ఉన్న వెబ్ సిరీస్‌కి ఇలియానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘ది ఫేమ్ గేమ్’ డైరెక్టర్ కరిష్మా కోహ్లీ ఈ సిరీస్ ను రూపొందిస్తున్నారు. 

అప్లాజ్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్, బీబీసీ స్టూడియోస్ ఇండియా సంస్థలు ఈ సిరీస్ ను కలిసి నిర్మిస్తున్నాయి. వైవిధ్యమైన కథాంశంతో ఈ సిరీస్‌ని రూపొందించనున్నట్టు తెలుస్తోంది. టైటిల్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఇలియానా హిందీలో నటించిన ‘అన్‌‌ ఫెయిర్ అండ్ లవ్‌‌లీ’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. గోవా బ్యూటీ చేతిలో మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి.
Go Back to Shorts
Ileana
web series
female led show

More Telugu News