సమంత తండ్రి జోసెఫ్ ప్రభు సోషల్ మీడియా పోస్టు వైరల్ అవుతోంది... ఎందుకంటే...!

  • సమంత, నాగచైతన్యల మధ్య సుదీర్ఘ ప్రేమాయణం
  • 2017లో ఒక్కటైన జంట
  • కొద్దికాలంలోనే విడాకులు
  • ఇప్పటికీ తెలియని కారణాలు
  • జోసెఫ్ ప్రభు పోస్టుతో మరోసారి చర్చనీయాంశం
Samantha father Joseph Prabu social media post went viral

టాలీవుడ్ లో ముచ్చటైన జంటగా గుర్తింపు పొందిన నాగచైతన్య, సమంత ఐదేళ్ల కిందట పెళ్లితో ఒక్కటయ్యారు. కానీ అనూహ్యరీతిలో విడిపోయి అందరినీ నివ్వెరపరిచారు. ఇప్పటికీ వారు ఎందుకు విడిపోయారన్నది స్పష్టంగా తెలియదు. 

ఈ నేపథ్యంలో, సమంత తండ్రి జోసెఫ్ ప్రభు సెప్టెంబరు 4న ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ పోస్టుతో పాటు తన కుమార్తె సమంత, నాగచైతన్యల పెళ్లి రిసెప్షన్ నాటి ఫొటోను కూడా పంచుకున్నారు. అందుకే ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. 

"అనగనగా చాన్నాళ్ల క్రితం... ఓ కథ జరిగింది. ఇప్పుడది ఎంతమాత్రం లేదు. అందుకే మరో కొత్త కథ ప్రారంభిద్దాం. మరో కొత్త అధ్యాయంతో మొదలుపెడదాం" అంటూ జోసెఫ్ ప్రభు ఫేస్ బుక్ లో స్పందించారు. 

కాగా, జరిగిన పరిణామాలపై భావోద్వేగాలను అధిగమించేందుకు చాలాకాలం పట్టిందని తెలిపారు. చిరస్మరణీయం అనుకున్న పెళ్లి ఇక మళ్లీ జరగదు కదా అంటూ జోసెఫ్ ప్రభు ఓ వ్యక్తి కామెంట్ కు ఎంతో విచారంతో బదులిచ్చారు.
.

More Telugu News