'కృష్ణ వ్రింద విహారి' నుంచి ట్రైలర్ వచ్చేస్తోంది!

Krishna Vrinda Vihari Movie Update
  • విభిన్న ప్రేమకథా చిత్రంగా 'కృష్ణ వ్రింద విహారి'
  • కథానాయికగా షిర్లే సెటియా
  • ఈ నెల 10వ తేదీన ట్రైలర్ రిలీజ్  
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
  • ఈ నెల 23వ తేదీన సినిమా విడుదల
నాగశౌర్య కి లవర్ బాయ్ గా మంచి క్రేజ్ ఉంది. లవ్ అనే  కంటెంట్ తో వచ్చిన ఆయన సినిమాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మధ్యలో ఆయన యాక్షన్ సినిమాల దిశగా వెళ్లాడుగానీ .. అవి అంతగా కలిసి రాలేదు. దాంతో ఆయన మళ్లీ ఒక ప్రేమ కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఆ సినిమా పేరే 'కృష్ణ వ్రింద విహారి'. 

నాగశౌర్య సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శ కత్వం వహించాడు. ఈ సినిమాతో కథానాయికగా షిర్లే సెటియా పరిచయం కానుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికిగాను తాజాగా ముహూర్తాన్ని ఖరారు చేశారు. 

ఈ నెల 10వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఈ నెల 23వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. సరైన హిట్ కోసం కొంతకాలంగా వెయిట్ చేస్తున్న నాగశౌర్యకి ఈ సినిమాతో ఆ ముచ్చట తీరుతుందేమో చూడాలి..
Go Back to Shorts
Nagashourya
Shirle Setiya
Anish krishna
Krishna Vrinda Vihari Movie

More Telugu News