Rayalaseema: రాయలసీమలో జలకళ.. వందేళ్ల తర్వాత పొంగి పొర్లుతోన్న వేదవతి

  • అనంతపురం, కర్నూలు జిల్లాల గుండా ప్రవహిస్తున్న వేదవతి
  • కర్ణాటక ప్రాజెక్టుల కారణంగా వేదవతిలో ప్రవాహం లేని వైనం
  • భైరవానితిప్ప ప్రాజెక్టు నుంచి అన్ని గేట్లు ఎత్తివేత
Floods to Vedavathi river after 100 yerars

కర్ణాటకతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, అనంతపురం, కర్నూలు జిల్లాల గుండా ప్రవహించే వేదవతి నది వరద నీటితో పోటెత్తుతోంది. గత వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా పొంగి పొర్లుతోంది. ఈ నదిపై కర్ణాటక ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల కారణంగా దశాబ్దాలుగా ప్రవాహం లేకుండా పోయింది. నది ఆనవాళ్లు కూడా మారిపోయే పరిస్థితి దాపురించింది.

 1982, 1996లో కొద్దిగా ప్రవాహం వచ్చింది. ఆ తర్వాత నదిలో నీరు కనిపించలేదు. ఇప్పుడు భారీ వర్షాల కారణంగా వేదవతి ఉగ్రరూపం దాల్చింది. వరద ఉద్ధృతి నేపథ్యంలో వేదవతిపై నిర్మించిన భైరవానితిప్ప ప్రాజెక్టు నుంచి అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా 63 వేల క్యూసెక్కుల నీటిని వదలడం ఇదే తొలిసారి. వరద ఉద్ధృతి నేపథ్యంలో పరీవాహక ప్రాంతాల్లో వేసిన పంట కొట్టుకుపోయింది. మరోవైపు ఎప్పుడూ లేని విధంగా వేదవతి పొంగి పొర్లుతుండటంతో స్థానికులు ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు.

More Telugu News