Paruchiri Gopala Krishna: పవన్ కల్యాణ్ ఒక వీరుడు.. చట్ట సభల్లో ఆయన అడుగు పెట్టాల్సిందే: పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna praises Pawan Kalyan
  • సమాజాన్ని మార్చాలనే ఆశయం పవన్ లో ఉందన్న పరుచూరి 
  • పవన్ తన వాయిస్ ను చట్టసభల్లో వినిపించాలనేది తన ఆకాంక్ష అని వెల్లడి 
  • మనకంటే ప్రపంచం గురించి పవన్ కే ఎక్కువ తెలుసని వ్యాఖ్య 
జనసేనాని పవన్ కల్యాణ్ చట్టసభల్లో అడుగుపెట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. ఏదో ఒక పార్టీలో చేరి పార్లమెంటుకో, అసెంబ్లీకో వెళ్లే ఆలోచన వేరు, యావత్ సమాజాన్నే మార్చాలనే ఆశయాన్ని కలిగి ఉండటం వేరని అన్నారు. ఆ బలమైన ఆశయం పవన్ లో ఉందని చెప్పారు. 

ఎన్నికల్లో నిలబడగానే గెలిచేస్తాం, సీఎం అయిపోతామనేది తర్వాతి విషయమని అన్నారు. తన వెనుక ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా పోరాటం చేసుకుంటూ పోయేవాడే వీరుడని... పవన్ కూడా వీరుడేనని చెప్పారు. పవన్ తన వాయిస్ ను చట్టసభల ద్వారా వినిపించాలని కోరుకుంటున్నానని అన్నారు. పవన్ మనసు తనకు బాగా తెలుసని... మనకంటే ఎక్కువగా ప్రపంచం గురించి పవన్ కే తెలుసని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పపన్ గెలుపొంది, చట్టసభల్లో అడుగుపెట్టాలని ఆకాంక్షించారు.
Paruchiri Gopala Krishna
Pawan Kalyan
Janasena
Tollywood

More Telugu News