POK: భారత్ లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్న 250 మంది ఉగ్రవాదులు

250 terrorists are waiting at LOC to infiltrate in to India
  • పీఓకే లోని పలు లాంచ్ ప్యాడ్ ల వద్ద నిరీక్షిస్తున్న ఉగ్రవాదులు
  • ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అలర్ట్ అయిన భారత సైన్యం
  • సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేసిన సైన్యం
భారత భూభాగంలోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వద్ద సుమారు 250 మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ ముష్కరులందరూ పీఓకేలోని పలు లాంచ్ ప్యాడ్ ల వద్ద మోహరించారని తెలిపింది. నిఘా వర్గాల హెచ్చరికలతో భారత సైన్యం అలర్ట్ అయింది. సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేసింది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తిప్పికొట్టేందుకు సన్నద్ధమైంది. ముఖ్యంగా ఉత్తర కశ్మీర్ లోని కేరన్ పోస్ట్ వద్ద నిఘాను తీవ్రతరం చేసింది. 

మరోవైపు, ఇటీవలి కాలంలో పాకిస్థాన్ నుంచి మన దేశంలోకి ఉగ్రవాదుల చొరబాట్లు తగ్గినప్పటికీ... డ్రగ్స్ మాత్రం పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా అవుతున్నాయి. డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బులతో పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ మాట్లాడుతూ, ఉగ్రవాదులే కాకుండా మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలు భారత్ లో కి రాకుండా నిఘాను కట్టుదిట్టం చేశామని చెప్పారు. ఇంకోవైపు, జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ముష్కరులను భద్రతాదళాలు కాల్చి చంపాయి.
POK
Terrorists
Army

More Telugu News