Corona Virus: దేశంలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో

Corona cases decreasing in India
  • గత 24 గంటల్లో 4,417 కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,032
  • ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,28,030
మన దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 4,417 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 6,032 మంది కరోనా నుంచి కోలుకోగా... 22 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 52,336 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,44,66,862కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,38,86,496 మంది కోలుకున్నారు. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 5,28,030 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.20 శాతంగా, రికవరీ రేటు 98.69 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా, క్రియాశీల రేటు 0.12 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,13,72,68,615 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 19,93,670 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 
Corona Virus
India
Updates

More Telugu News