Andhra Pradesh: గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల బాధ్య‌త‌ల‌ను ఇద్ద‌రు మంత్రుల‌కు అప్ప‌గించిన జ‌గ‌న్‌

ap cm ys jagan allocates village and ward secretariates to 2 ministers
  • గ్రామ స‌చివాల‌యాలు బూడి ముత్యాల నాయుడికి అప్ప‌గింత‌
  • వార్డు స‌చివాల‌యాలు ఆదిమూల‌పు సురేశ్‌కు అప్ప‌గింత‌
  • ఆదేశాలు జారీ చేసిన సీఎం జ‌గ‌న్‌

ఏపీలో ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను నేరుగా ప్ర‌జ‌ల‌కు చేర్చేందుకు ఉద్దేశించిన గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల బాధ్య‌త‌ల‌కు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోమ‌వారం ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. స‌చివాల‌యాల ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌ను త‌న కేబినెట్‌లోని ఇద్దరు మంత్రుల‌కు అప్ప‌గిస్తూ ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు. మునిసిప‌ల్ శాఖ మంత్రిగా కొన‌సాగుతున్న ఆదిమూల‌పు సురేశ్‌కు ప‌ట్ట‌ణాల్లోని వార్డు స‌చివాల‌యాల బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిన జ‌గ‌న్‌... గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కొన‌సాగుతున్న బూడి ముత్యాల‌నాయుడుకు గ్రామాల్లోని స‌చివాల‌యాల బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.

  • Loading...

More Telugu News