స‌ర్కారీ పాఠ‌శాల‌ల అభివృద్ధి కోసం కొత్త ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించిన మోదీ... వివ‌రాలివిగో

  • పీఎం- శ్రీ యోజ‌న‌ పథకాన్ని ప్ర‌క‌టించిన మోదీ
  • దీనికింద దేశంలోని 14,500 పాఠ‌శాల‌లు అభివృద్ధి
  • ఇవన్నీ ‌మోడ‌ల్ స్కూళ్లుగా మార‌తాయ‌ని ప్రకటన 
pm narendra modi announces PM SHRI Yojana

దేశంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల అభివృద్ధి కోసం కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు కొత్త పథకాన్ని ప్రారంభించింది. 'ప్ర‌ధాన మంత్రి స్కూల్స్ ఫ‌ర్ రైజింగ్ ఇండియా (పీఎం- శ్రీ) యోజ‌న' పేరిట ఈ ప‌థ‌కాన్ని సోమ‌వారం ప్ర‌క‌టించింది. ఉపాధ్యాయుల దినోత్స‌వం సంద‌ర్భంగా సోమ‌వారం జాతీయ ఉత్త‌మ ఉపాధ్యాయుల అవార్డులు అందుకున్న టీచ‌ర్ల‌తో స‌మావేశ‌మైన అనంత‌రం మోదీ ఈ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఈ ప‌థ‌కం వివ‌రాల‌ను ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేసిన‌ ట్వీట్ల‌లో వెల్ల‌డించారు. 

దీని ప్రకారం, పీఎం- శ్రీ యోజ‌న పేరిట దేశంలోని 14,500 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను అభివృద్ధి చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంతో ఈ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు మోడ‌ల్ స్కూళ్లుగా మార‌తాయ‌ని ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. ఈ ప‌థ‌కం ద్వారా ప్ర‌భుత్వ విద్యాల‌యాల్లో విద్య‌న‌భ్య‌సిస్తున్న ల‌క్ష‌లాది మంది విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని మోదీ పేర్కొన్నారు.

More Telugu News