హరీశ్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ?

05-09-2022 Mon 18:44 | Entertainment
  • విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీగా 'ఖుషీ'
  • 'జన గణ మన' ఇప్పట్లో లేనట్టే 
  • హరీశ్ శంకర్ కి ఓకే చెప్పినట్టుగా టాక్ 
  • నిర్మాతగా తెరపైకి దిల్ రాజు పేరు
Vijay Devarakonda in Harish Shankar Movie
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'లైగర్' ఆయన అభిమానులను నిరాశపరిచింది. ఆ తరువాత సినిమా అయిన 'ఖుషీ' పైనే ఆయన పూర్తి దృష్టి పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం చిత్రీకరణను జరుపుకున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ జోడీగా సమంత నటిస్తోంది. 

ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ 'జన గణ మన' సినిమా చేయవలసి ఉంది. కానీ 'లైగర్' ఫ్లాప్ కావడంతో, ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి పూరి మరింత సమయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్ తో విజయ్ దేవరకొండ సినిమా ఉండనున్నట్టుగా తెలుస్తోంది. 

పవన్ తో 'భవదీయుడు భగత్ సింగ్' చేయాలని హరీశ్ శంకర్ నిర్ణయించుకున్నాడు. కానీ పవన్ నుంచి ఎప్ప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చేది తెలియదు. ఆల్రెడీ విజయ్ దేవరకొండకి అడ్వాన్స్ ఇచ్చేసి ఉన్న దిల్ రాజు, ఆయనను హరీశ్ శంకర్ కి కలిపినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళుతుందనే టాక్ బలంగానే వినిపిస్తోంది.