సౌత్ ఈస్ట్రన్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఆధునికీకరణ పనులు.. విశాఖ నుంచి వెళ్లే పలు రైళ్ల రద్దు

  • మరికొన్ని రైళ్ల గమ్యాల కుదింపు
  • ఇంకొన్ని రైళ్లు ఆలస్యం
  • ప్రయాణికులు సహకరించాలని కోరిన వాల్తేరు డీసీఎం
some trains from Visakha cancelled and some will delayed due to railway work

సౌత్ ఈస్ట్రన్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఆధునికీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పలు రైళ్లు రద్దు చేయడమే కాకుండా ఇంకొన్ని రైళ్ల గమ్యస్థానాలను కుదించినట్టు వాల్తేరు డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. అలాగే, మరికొన్ని రైళ్లు ఆలస్యంగా బయలుదేరుతాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

రద్దు చేసిన రైళ్లు ఇవే
ఈ నెల 6 నుంచి 12 వరకు విశాఖ-రాయపూర్ (08528), 7 నుంచి 13 వరకు రాయపూర్-విశాఖ(08527) రైళ్లను మహాసముండ-రాయపూర్-మహాసముండ స్టేషన్ల మధ్య రద్దు చేశారు. ఈ నెల 11న విశాఖ-కోర్బా (18518), 12న కోర్బా-విశాఖ (18517), 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విశాఖ-దుర్గ్ (18530), 7 నుంచి 13 వరకు దుర్గ్-విశాఖ (18529) రైళ్లను రద్దు చేశారు.

దారి మళ్లించిన రైళ్లు

తిరుపతి-బిలాస్‌పూర్ (17482) రైలును 8, 11 తేదీల్లో, బిలాస్‌పూర్-తిరుపతి (17481) రైలును 10, 13 తేదీల్లో, పూరీ-అహ్మదాబాద్ (12843) రైలును 6, 8, 9, 10, 13, 15 తేదీల్లో, అహ్మదాబాద్-పూరీ (12844) రైలును 8, 10, 11, 12, 15 తేదీల్లో టిట్లాఘర్, సంబల్‌పూర్, జార్సుగూడ మీదుగా దారిమళ్లించారు.

ఆలస్యంగా బయలుదేరే రైళ్లు
విశాఖ-కోర్బా (18518) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 12న 5 గంటలు, విశాఖ-నిజాముద్దీన్ (12897) సమతా ఎక్స్‌ప్రెస్ 8, 15 తేదీల్లో 2 గంటలు, హజ్రత్ నిజాముద్దీన్-విశాఖ (12808) సమతా ఎక్స్‌ప్రెస్ 12న 5 గంటలు, తిరుపతి-బిలాస్‌పూర్ (17482) ఎక్స్‌ప్రెస్ 15న 4 గంటలు, విశాఖ-భగత్ కీ-కోఠి (18573) రైలు ఆలస్యంగా బయలుదేరుతాయి.

More Telugu News