బిగ్ బాస్ వేదికపై సందడి చేసిన రణబీర్, అలియా
- ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్-6
- రణబీర్, అలియాలకు స్వాగతం పలికిన నాగ్
- తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచిన రణబీర్
- ఏకంగా తెలుగులో పాట పాడిన అలియా
అనంతరం, అలియా తెలుగులో ఓ పాట పాడి అందరినీ అలరించింది. బ్రహ్మాస్త్రం చిత్రంలోని పాటను ఆమె ఎంతో హృద్యంగా ఆలపించింది. ఈ సందర్భంగా, బ్రహ్మాస్త్రం ప్రోమోను బిగ్ బాస్ స్క్రీన్ పై ప్రదర్శించారు. ఆ బాలీవుడ్ జోడీకి నాగ్ శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మాస్త్రం చిత్రంలో నాగార్జున ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ వేదిక నుంచి వీడ్కోలు తీసుకుంటూ రణబీర్... నాగ్ కు పాదాభివందనం చేశాడు.