Poojitha Ponnada: దేవి శ్రీ ప్రసాద్ తో సీక్రెట్ గా పెళ్లి జరిగిందంటూ వస్తున్న వార్తలపై పూజిత పొన్నాడ స్పందన

Poojitha Ponnada reacts to rumors
  • ఊపిరి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పూజిత
  • ప్రస్తుతం ఆకాశ వీధుల్లో చిత్రంలో నటించిన వైజాగ్ బ్యూటీ
  • దేవి శ్రీతో పెళ్లంటూ కథనాలు
  • తనకు ఎవరితోనూ రిలేషన్ లేదంటూ పూజిత స్పష్టీకరణ
టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన అచ్చ తెలుగు నటి పూజిత పొన్నాడ తనపై వస్తున్న కథనాల పట్ల స్పందించింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో తన పెళ్లి సీక్రెట్ గా జరిగిందంటూ వస్తున్న కథనాలను ఆమె ఖండించింది. దేవి శ్రీ ప్రసాద్ తోనే కాదు... తనకు ఎవరితోనూ రిలేషిన్ షిప్ లేదని స్పష్టం చేసింది. ఇలాంటి కథనాలు ఎలా పుట్టిస్తారో అర్థం కాదని పూజిత పొన్నాడ వాపోయింది. దేవి శ్రీ ప్రసాద్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దంటూ హితవు పలికింది. 

గతంలో రంగస్థలం, హ్యాపీ వెడ్డింగ్, ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాల్లో నటించిన పూజిత ప్రస్తుతం 'ఆకాశ వీధుల్లో' అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ప్రస్తుతం తాను ఒంటరినే అని, సోషల్ మీడియాలో నెగెటివ్ వ్యాఖ్యలు బాధ కలిగిస్తాయని వెల్లడించింది. వైజాగ్ కు చెందిన పూజిత పొన్నాడ 'ఊపిరి' చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయం అయింది.
Poojitha Ponnada
Devi Sri Prasad
Secret Marriage
Actress
Tollywood

More Telugu News