KTR: తన తాత గారితో కలిసున్న మరో అరుదైన ఫొటో పంచుకున్న కేటీఆర్

KTR shares another adorable pic of his maternal grand father J Keshava Rao
  • ఇటీవల తన తాతయ్య కేశవరావు ఫొటోలు పంచుకున్న కేటీఆర్
  • అందులో పిల్లవాడిగా ఉన్న కేటీఆర్
  • తాజాగా పంచుకున్న ఫొటోలో కుర్ర కేటీఆర్ దర్శనం
  • తనంటే తాత గారికి ఎంతో వాత్సల్యం అని వెల్లడి
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల తన తాతయ్య జె.కేశవరావు ఫొటోలు పంచుకున్న సంగతి తెలిసిందే. ఆ ఫొటోల్లో చిన్నప్పటి కేటీఆర్ కనిపించాడు. కాగా, తాను ఎదిగిన తర్వాత తాతయ్య కేశవరావుతో కలిసి దిగిన ఫొటోను కేటీఆర్ తాజాగా ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఎప్పుడూ చలాకీగా ఉండే మా తాతయ్య జోగినపల్లి కేశవరావు గారితో మరో ఫొటో అంటూ ట్వీట్ చేశారు. ఆయనకు తానే మొదటి మనవడ్నని, అందుకే తనపై ప్రత్యేకంగా ఆపేక్ష చూపించేవారని కేటీఆర్ వెల్లడించారు. 

కాగా, కేటీఆర్ ఇటీవల పంచుకున్న ఫొటోలపై తెలంగాణ బీజేపీ 'మెదడుకు మేత' అంటూ స్పందించింది. తన తాతయ్య కేశవరావు గురించి కేటీఆర్ చెప్పిందంతా నిజమే అయితే ఆయనకు తాము సెల్యూట్ చేస్తున్నామని పేర్కొంది. "అయితే, నిజాంలకు వ్యతిరేకంగా ఆయన పోరాడాడని చెప్పడానికి మీకందరికీ ఇన్నాళ్ల సమయం ఎందుకు పట్టిందన్నది ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు, ఇన్నాళ్లుగా ఆయనను కల్వకుంట్ల కుటుంబం ఎందుకు ఆదర్శంగా తీసుకోలేకపోయింది?" అంటూ తెలంగాణ బీజేపీ ప్రశ్నించింది.
KTR
Grand Father
J Keshava Rao
BJP
Telangana

More Telugu News