అప్పటిదాకా బ్రతకండి, బ్రతకనివ్వండి అంటూ సోషల్ మీడియాకు ఛార్మీ కౌర్ దూరం
- పూరీ జగన్నాథ్, ఛార్మీ నిర్మాణంలో వచ్చిన ‘లైగర్’ కు భారీ నష్టాలు
- సినిమా విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
- కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్టు ఛార్మీ ట్వీట్
ప్రమోషన్స్ లో భాగంగా ‘లైగర్’ ఓ రేంజ్లో ఉంటుందని చెప్పిన చిత్ర బృందాన్ని సోషల్ మీడియాలో పలువురు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఛార్మీ కౌర్ అనూహ్యంగా నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆమె ఓ ట్వీట్ చేసింది. ‘గయ్స్ కాస్త శాంతించండి. చిన్న బ్రేక్ తీసుకుంటున్నా.. సోషల్ మీడియా నుంచి. పూరీ కనెక్ట్స్ మరింత దృఢంగా, మెరుగ్గా మళ్లీ తిరిగొస్తుంది. అప్పటి వరకు బ్రతకండి. బ్రతకనివ్వండి’ అంటూ హార్డ్ ఎమోజీని యాడ్ చేసి ఛార్మీ ట్వీట్ చేసింది.