టీమిండియాతో కీలక మ్యాచ్ ముంగిట పాకిస్థాన్ కు ఎదురుదెబ్బ
- పాక్ పేసర్ షానవాజ్ దహానీకి గాయం
- డొక్క నొప్పితో బాధపడుతున్న దహానీ
- టీమిండియాతో పోరుకు దూరం
- రేపు ఆసియాకప్ లో సూపర్-4లో భారత్ వర్సెస్ పాక్
కాగా, దహానీ స్థానంలో మహ్మద్ హస్నైన్, హసన్ అలీల్లో ఒకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన పేసర్ షహీన్ అఫ్రిది గాయంతో టోర్నీ మొత్తానికి దూరం కావడం తెలిసిందే. ఇప్పుడు మరో పేసర్ కూడా గాయపడి వైదొలగడం పాక్ జట్టు ప్రణాళికలను బలహీనపర్చుతుందని క్రికెట్ పండితులు భావిస్తున్నారు.