Psychologist: లైంగిక వేధింపుల కేసులో ప్ర‌ముఖ సైకాల‌జిస్ట్ న‌గేశ్‌కు జైలు శిక్ష‌

psychologist bp nagesh arrested for sexual harassment
  • గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన న‌గేశ్‌
  • హైద‌రాబాద్ కేంద్రంగా వ్య‌క్తిత్వ వికాస త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్న వైనం
  • న‌గేశ్‌పై హైద‌రాబాద్ షీ టీమ్‌కు ఓ విద్యార్థిని ఫిర్యాదు
  • సైకాల‌జిస్ట్‌కు 16 రోజుల జైలు శిక్ష విధించిన నాంప‌ల్లి కోర్టు
  • న‌గేశ్‌ను చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లించిన పోలీసులు
తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ముఖ సైకాల‌జిస్టుగా గుర్తింపు పొందిన బీపీ న‌గేశ్‌కు జైలు శిక్ష ఖ‌రారైంది. ఏపీలోని గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన న‌గేశ్‌... హైద‌రాబాద్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్య‌క్తిత్వ వికాస త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లు క‌ళాశాల‌ల్లో వ్య‌క్తిత్వ వికాస త‌ర‌గతులు నిర్వ‌హిస్తున్న న‌గేశ్‌పై హైద‌రాబాద్‌కు చెందిన ఓ క‌ళాశాల విద్యార్థిని... త‌న‌తో న‌గేశ్ అసభ్యంగా మాట్లాడారంటూ షీ టీమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదు ఆధారంగా న‌గేశ్‌ను అదుపులోకి తీసుకున్న షీ టీమ్ పోలీసులు శ‌నివారం నాంప‌ల్లి కోర్టులో హాజ‌రుప‌రిచారు. ఈ కేసులో పోలీసుల వాద‌న‌లు విన్న కోర్టు న‌గేశ్‌కు 16 రోజుల పాటు జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు ఆధారంగా న‌గేశ్‌ను పోలీసులు చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించారు.
Psychologist
Hyderabad Police
Hyderabad
B P Nagesh

More Telugu News