Vikrram: విజయ్ .. విక్రమ్ .. ఓ మల్టీ స్టారర్!

Vijay in Vikram movie
  • రీసెంట్ గా రిలీజైన 'కోబ్రా'
  • అంచనాలను అందుకోలేకపోయిన సినిమా 
  • విజయ్ స్టయిల్ ఇష్టమన్న విక్రమ్ 
  • తమ కాంబోలో మల్టీ స్టారర్ ఉంటుందంటూ వ్యాఖ్య
విక్రమ్ హీరోగా ఇటీవలే 'కోబ్రా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా, బడ్జెట్ పరంగా విక్రమ్ స్థాయిలోనే ఉంది. కానీ కథాకథనాల పరంగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక తమిళనాడులో కూడా ఈ సినిమా ఇదే టాక్ ను తెచ్చుకుంది.

తాజాగా కోలీవుడ్ మీడియాతో విక్రమ్ మాట్లాడుతూ ఉండగా విజయ్ ప్రస్తావన వచ్చింది. విజయ్ స్టయిల్ .. ఆయన డైలాగ్ డెలివరీ.. డాన్స్ అంటే తనకి ఎంతో ఇష్టమని విక్రమ్ చెప్పారు. ఆయనతో ఒక మల్టీస్టారర్ చేయాలనే ఆశతో ఉన్నానని అన్నారు. భవిష్యత్తులో తమ కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుందని చెప్పారు. 

తమ కాంబినేషన్లోని సినిమాకి కూడా అజయ్ జ్ఞానముత్తునే దర్శకత్వం వహిస్తాడని అన్నారు. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్లోని కథను అజయ్ జ్ఞానముత్తు రెడీ చేయడం .. విక్రమ్ కి వినిపించేయడం జరిగిపోయిందని అంటున్నారు. ఇక విని ఓకే చెప్పాల్సింది విజయ్ మాత్రమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Vikrram
Vijay
Kollywood

More Telugu News