BJP: తెలంగాణ పర్యటనకు వచ్చిన మరో కేంద్ర మంత్రి

union minister Mahendra Nath Pandey arrives shamshabad airport
  • జ‌హీరాబాద్ పార్ల‌మెంటులో ప‌ర్య‌టిస్తున్న నిర్మ‌లా సీతారామ‌న్‌
  • మ‌హ‌బూబ్ న‌గ‌ర్ పార్ల‌మెంటు ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన మ‌హేంద్ర‌నాథ్ పాండే
  • శంషాబాద్‌లో పాండేకు స్వాగ‌తం ప‌లికిన జితేంద‌ర్ రెడ్డి
తెలంగాణ‌లోని పార్ల‌మెంటు నియోజ‌కవ‌ర్గాల వారీగా కేంద్ర మంత్రుల‌కు బీజేపీ కో ఆర్డినేట‌ర్ల బాధ్య‌త‌లు అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా జ‌హీరాబాద్ పార్ల‌మెంటు కో ఆర్డినేట‌ర్‌గా నియ‌మితులైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ గురువారమే తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. శ‌నివారం దాకా ఆమె జ‌హీరాబాద్ ప‌రిధిలో ప‌ర్య‌టించ‌నున్నారు.

తాజాగా నిర్మ‌ల ప‌ర్య‌ట‌న ముగియ‌క‌ముందే మ‌రో కేంద్ర మంత్రి తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ కో ఆర్డినేట‌ర్‌గా నియ‌మితులైన కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మ‌హేంద్ర నాథ్ పాండే శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ నేత‌, మ‌హబూబ్ న‌గ‌ర్ మాజీ ఎంపీ ఏపీ జితేంద‌ర్ రెడ్డి ఆయ‌న‌కు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. రేప‌టి నుంచి మ‌హేంద్ర‌నాథ్ పాండే మ‌హ‌బూబ్ న‌గ‌ర్ పార్ల‌మెంటు ప‌రిధిలో ప‌ర్య‌టించ‌నున్నారు.
BJP
Telangana
Mahaboobnagar
AP Jitender Reddy
Mahendra Nath Pandey

More Telugu News