Pawan Kalyan: తెలుగోడు తొడకొట్టాడు... పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' నుంచి 'పవర్ గ్లాన్స్' వీడియో ఇదిగో!

Power Glance video released from Pawan Kalyan Hari Hara Veera Mallu
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇవాళ (సెప్టెంబరు 2) పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి పవర్ గ్లాన్స్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో పవన్ కొంతమంది వస్తాదులతో పోరాడి వారిని మట్టికరిపించిన దృశ్యాలున్నాయి. విజయనాదం చేస్తూ పవన్ తొడకొట్టడాన్ని ఈ పవర్ గ్లాన్స్ వీడియోలో చూడొచ్చు. 

వాస్తవానికి ఈ పవర్ గ్లాన్స్ ను నేటి సాయంత్రం విడుదల చేస్తామని చిత్రబృందం గత ప్రకటనలో పేర్కొన్నా, ముందుగానే విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. "మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకుని తొడకొట్టాడో తెలుగోడు" అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. 

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న హరిహర వీరమల్లు చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయిక. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం, దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Hari Hara Veera Mallu
Power Glance
Video
Birthday
Tollywood

More Telugu News