రిషి సునాక్ కృషి ఫలిస్తుందా? వచ్చే సోమవారమే తేలిపోతుంది!

  • రేసులో రిషి సునాక్ వెనుకంజ
  • దూసుకుపోతున్న లిజ్ ట్రస్ 
  • సోమవారం వెలువడనున్న ఫలితాలు
Rishi Sunak Trailing Liz Truss Poised To Become Next UK PM

లిజ్ ట్రస్.. రిషిసునాక్.. వీరిద్దరిలో తదుపరి బ్రిటన్ ప్రధాని ఎవరన్నది వచ్చే సోమవారంతో తేలిపోనుంది. మొదట్లో రిషి సునాక్ బలమైన అభ్యర్థిగా ముందుండగా, కొంత వ్యవధి తర్వాత లిజ్ ట్రస్ రిషిని దాటుకుని ముందుకుపోయారు. 


దేశవ్యాప్తంగా ఇరువురు అభ్యర్థుల మధ్య రాజకీయ సమావేశాలు, టెలివిజన్ చర్చల తర్వాత లిజ్ ట్రస్ ముందంజలో ఉన్నారు. కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిగా లిజ్ ట్రస్ కే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రధాని అభ్యర్థిగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఆమెనే ఎన్నుకోవచ్చని తెలుస్తోంది. రిషి సునాక్ కంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఆమెకే ఉంది. 

ఇక ప్రధానిగా ఎవరు వచ్చినా వారి ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. అక్కడ జీవన వ్యయం గణనీయంగా పెరిగిపోయింది. ద్రవ్యోల్బణం రెండంకెల్లో చలిస్తోంది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. రిషి సునాక్ భారత సంతతి వ్యక్తి. ఆయన ట్రస్ తో పోటీలో వెనుకబడడం వెనుక భారతీయతే కారణం అయి ఉండొచ్చన్న సందేహాలున్నాయి. దీన్ని రిషి సునాక్ మాత్రం ఖండించారు.

More Telugu News