asia cup: నాగిని డ్యాన్స్​ తో బంగ్లాదేశ్​ పై పగ తీర్చుకున్న శ్రీలంక ఆటగాడు

Sri Lanka cricketer Chamika Karunaratne trolls Bangladesh with naagin dance after making to Asia Cup Super 4
  • ఆసియా కప్ లో ఉత్కంఠ పోరులో బంగ్లాపై లంక గెలుపు
  • సూపర్4 రౌండ్ కు అర్హత సాధించిన శ్రీలంక
  • మ్యాచ్ ముగిసిన వెంటనే నాగిని డ్యాన్స్ చేసిన చమిక కరుణరత్నే
ఆసియా కప్ లో శ్రీలంక సూపర్ 4 దశకు చేరుకుంది. గ్రూప్-బిలో భాగంగా గురువారం రాత్రి జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో బంగ్లాదేశ్ ను ఓడించిన శ్రీలంక ముందంజ వేసింది. వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిన బంగ్లాదేశ్ ఇంటిదారి పట్టింది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత చమిక కరుణరత్నే నాగిని డ్యాన్స్‌ చేశాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే లంక డ్రెస్సింగ్ రూమ్ లో అతను నాగిని డ్యాన్స్ చేయడం కెమెరాలో రికార్డైంది.

 ఒక రకంగా కరుణరత్నే ఈ డ్యాన్స్ తో బంగ్లాదేశ్ ను ఆటపట్టించాడు. ఎందుకంటే కొన్నేళ్లుగా బంగ్లా ఆటగాళ్లు, అభిమానులు నాగిని డ్యాన్స్ తో తమ విజయాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే, ఇది వాళ్ల విజయానందం కంటే అవతలి జట్లను ఎద్దేవా చేసినట్లు ఉంటుంది. దాంతో, లంక ఆటగాడు కరుణరత్నే బంగ్లాదేశ్ శైలిలోనే ఆ జట్టుపై పగ తీర్చుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ గా మారింది.
asia cup
Bangladesh
Sri Lanka
Cricket
naagin dance

More Telugu News