Ganesh Idol: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వినాయక విగ్రహం ఇదే!

This is the biggest Ganesh idol in Telugu states
  • దొండపర్తిలో 102 అడుగుల గణేశ్ విగ్రహం
  • ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ యువసేన
  • పూర్తిగా మట్టితో తయారైన విగ్రహం
  • స్వామివారితో పాటు 102 కిలోల లడ్డూ

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వినాయక చవితి కోలాహలం అంబరాన్నంటుతోంది. వాడవాడలా గణపతి మండపాలు వెలిశాయి. విఘ్నేశ్వరుడిని భక్తి ప్రపత్తులతో పూజిస్తున్నారు. కాగా, ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్లా వైజాగ్ లోని దొండపర్తి వినాయక విగ్రహం అత్యంత ఎత్తయినదిగా గుర్తింపు తెచ్చుకుంది. 

దొండపర్తిలో వైఎస్ జగన్ యువసేన 102 అడుగుల భారీ గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ విగ్రహం మొత్తం మట్టితోనే తయారుచేయడం విశేషం. ఈ విగ్రహంతో పాటు 102 కిలోల లడ్డు కూడా ఉంచారు. 

దొండపర్తి వినాయకుడ్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తుండడంతో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కాగా, ఈ విగ్రహాన్ని 21 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News