tpcc: పార్టీ కార్యకర్తపై అత్యాచారం.. టీ కాంగ్రెస్​ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు శివకుమార్​ రెడ్డిపై కేసు

  • పెళ్లి సాకుతో తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తున్న పార్టీ మహిళా కార్యకర్త
  • ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించాడని ఆరోపణ 
  • పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
Telangana Congress leader booked for raping party worker on pretext of marriage

  కాంగ్రెస్ పార్టీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు కుంభం శివకుమార్‌ రెడ్డి అత్యాచారం కేసులో ఇరుకున్నారు. పెళ్లి సాకుతో సొంత పార్టీకే చెందిన మహిళపై అత్యాచారం చేశారనే ఆరోపణలపై  హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. 

శివకుమార్ రెడ్డి తనకు మద్యం తాగించి, నగరంలోని ఓ హోటల్‌లో తనపై అత్యాచారం చేశారని, తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు దీన్ని రికార్డు చేశారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. తాను కాంగ్రెస్ పార్టీ సభ్యురాలినని, 2020లో మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి, పార్టీని సమన్వయం చేసే బాధ్యతలు కూడా నిర్వహించానని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

‘మున్సిపల్ ఎన్నికల్లో నాకు నారాయణపేట ప్రాంతాన్ని కేటాయించారు. పార్టీ ఆదేశించిన పని కోసం నేను పని కోసం నారాయణపేటకు వెళ్లాను. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డిని కలిశాను. ఈ క్రమంలో ఆయన నాతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించారు. నా ఫోన్ కు తరచూ మెసేజ్ లు పంపించేవారు. చివరగా ఒక సందర్భంలో పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ఇప్పటికే ఆయనకు పెళ్లయిన విషయాన్ని ప్రశ్నిస్తే.. తన భార్య తీవ్ర అనారోగ్యంతో ఉందని, మూడేళ్లకు మించి బతకదన్నారు. తనకు తోడు అవసరమని బదులిచ్చారు’ అని ఫిర్యాదులో ఆమె పేర్కొందని పోలీసులు తెలిపారు.

పార్టీ పని నిమిత్తం ఈ ఇద్దరూ దుబ్బాకలో ఉన్న సమయంలో, శివకుమార్ రెడ్డి మద్యం మత్తులో సదరు మహిళ గదికి వచ్చి తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారని పోలీసులు చెప్పారు. దీనికి అంగీకరించకపోవడంతో తనపై శారీరకంగా దాడికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తర్వాత శివకుమార్ రెడ్డి ఆమె మెడలో పసుపు తాడు కట్టి పెళ్లి చేసుకున్నట్టు నమ్మించే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు. 

మాట్లాడుకుందామని ఓ ప్రముఖ హోటల్‌కు పిలవడంతో మహిళ అక్కడికి వెళ్లిందని పోలీసులు చెప్పారు. అక్కడ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెపై అత్యాచారం చేసి దీన్ని ఫోన్ లో రికార్డు చేశారని తెలిపారు. సదరు మహిళ స్పృహలోకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే .. చెప్పినట్టు వినకపోతే ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించాని ఆమె ఫిర్యాదులో పేర్కొనట్టు వెల్లడించారు. ఈ ఫిర్యాదు మేరకు శివకుమార్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్లు 420 (చీటింగ్), 476 (రేప్), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News