Emirates: ఎమిరేట్స్ ఎయిర్ హోస్టెస్‌కు విమానంలో అందమైన అనుభవం.. వీడియో వైరల్

Emirates air hostess welcomes her toddler son onboard video viral
  • తల్లికి బోర్డింగ్ పాస్ చూపించిన కుమారుడు 
  • అది చూసి ఆనందం పట్టలేకపోయిన ఎయిర్‌హోస్టెస్
  • కౌగిలించుకుని మురిసిపోయిన వైనం
  • కామెంట్లతో హోరెత్తుతున్న ఇన్‌స్టాగ్రామ్
ఎయిర్‌హోస్టెస్‌లు ప్రతి రోజూ వందలాదిమంది ప్రయాణికులను విమానంలోకి ఆహ్వానిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వారికి అందమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. జీవితంలో మధురానుభూతులుగా మిగిలిపోతాయి. తాజాగా ఎమిరేట్స్ ఎయిర్‌హోస్టెస్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ గొప్ప వ్యక్తిని విమానంలోకి ఆహ్వానిస్తున్నట్టున్న ఆ ఇన్‌స్టాగ్రామ్ వీడియో వైరల్ అవుతోంది. 

విమానంలోకి వస్తున్న ఓ చిన్న కుర్రాడు ఎయిర్‌హోస్టెస్‌కు బోర్డింగ్ పాస్ చూపించాడు. అది తీసుకున్న ఆమె ఆశ్చర్యచకితురాలైంది. ఆ బోర్డింగ్ పాస్ అందించిన కుర్రాడు మరెవరో కాదు.. ఆమె కుమారుడే. తన కుమారుడిని చూసిన ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. వెంటనే అతడిని కౌగిలించుకుని మురిసిపోయింది. 

ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన ఎయిర్‌హోస్టెస్.. తన జీవితంలో తాను చూసిన అతిపెద్ద వీఐపీ అతడేనని, చాలా ఆనందంగా ఉందని, దుబాయ్‌కి తిరిగి వెళ్తున్నామంటూ ఆ వీడియోకు క్యాప్షన్ తగిలించింది. ఈ వీడియో ఇన్‌స్టాలో వేలాది లైకులు, కామెంట్లను సొంతం చేసుకుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Emirates
Air Hostess
Onboard
Viral Videos

More Telugu News