Corona Virus: మీ శరీరంలో యాంటీబాడీలు తగ్గిపోతున్నాయి.. త్వరగా బూస్టర్ డోసులు తీసుకోండి: ఎన్‌టాగి

  • కరోనాతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో 90శాతం మంది బూస్టర్ డోసు తీసుకోని వారేనన్న ఎన్‌టాగి చైర్మన్
  • టీకాలు తీసుకుని 8 నెలలు అయిన వారు బూస్టర్ డోసు తీసుకోవాలని సూచన
  • కరోనా ఇంకా చుట్టుముడుతూనే ఉందని వ్యాఖ్య
Advise everyone to take booster doses soon

కరోనా సమయంలో వేయించుకున్న టీకాల నుంచి గరిష్ఠంగా 8 నెలలు మాత్రమే రక్షణ లభిస్తుందని అప్పట్లో నిపుణులు చెప్పారు. ఆ గడువు దాటిన తర్వాత శరీరంలోని యాంటీబాడీలు తగ్గిపోతాయని, కాబట్టి బూస్టర్ డోసు తప్పనిసరని ప్రభుత్వం ఘంటాపథంగా చెప్పింది. ప్రస్తుతం మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోమారు ప్రజలను అప్రమత్తం చేసింది. యాంటీబాడీలు తగ్గిపోతుండడంతో కరోనా మళ్లీ సోకే అవకాశం ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరు ప్రికాషనరీ డోసు వేసుకోవాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టాగి) చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా సూచించారు.

ప్రస్తుతం కొవిడ్‌తోపాటు పలు రకాల వైరస్‌లు కూడా వ్యాప్తిలో ఉన్నాయన్న ఆయన.. అవి తీవ్ర ప్రభావం చూపించకపోవడంతో మరణాల సంఖ్య బాగా తగ్గిందని పేర్కొన్నారు. అయినప్పటికీ కరోనా వ్యాప్తి కొనసాగుతోందన్న విషయాన్ని మర్చిపోవద్దని, ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ తీసుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందాలని సూచించారు. అంతేకాదు, గత ఏడెనిమిది నెలల్లో ఆసుపత్రిలో చేరిన కరోనా రోగుల్లో 90శాతం మంది బూస్టర్ డోసు తీసుకోని వారేనని పేర్కొన్నారు.

More Telugu News