Kiran Abbavaram: 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' నుంచి సాంగ్ రిలీజ్!

  • కిరణ్ హీరోగా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'
  • హీరోయిన్ గా సంజన ఆనంద్ పరిచయం 
  • ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్లో సాగే కథ 
  • నిర్మాతగా కోడి రామకృష్ణ కూతురు  
  • వచ్చేనెల 9న సినిమా రిలీజ్  
Nenu Meeku Baga Kavalsinavadini movie update

కిరణ్ అబ్బవరం హీరోగా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా రూపొందింది. కోడి దివ్య నిర్మించిన ఈ సినిమాకి శ్రీధర్ గాదె దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా సంజన ఆనంద్ పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు. 

'అట్టాంటి ఇట్టాంటిదాన్ని కాను మావో' అంటూ ఈ పాట సాగుతోంది. ఇది ఒక దాభాలో సాగే ఐటమ్ సాంగ్. జోరుగా .. హుషారుగా సాగే మాస్ బీట్ ఇది. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి శ్యామ్ కాసర్ల సాహిత్యాన్ని అందించాడు. సాకేత్ - కీర్తన ఆలపించగా, భాను కొరియోగ్రఫీని అందించాడు.

విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందింది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునే కథ అంటూ ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. వచ్చేనెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. గత రెండు సినిమాల ఫ్లాపులతో డీలాపడిన కిరణ్ కి, ఈ సినిమా ఊరట నిస్తుందేమో చూడాలి.

More Telugu News