Eluru District: బుట్టాయగూడెం మండలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

50 YSRCP supporting families joins TDP
  • ఏలూరు జిల్లా గణపవరం గ్రామంలో టీడీపీలోకి భారీగా చేరికలు
  • నియోజకవర్గ ఇన్ఛార్జి బొరగం శ్రీనివాసులు సమక్షంలో చేరికలు
  • పార్టీలో అందరికీ సముచిత స్థానాన్ని కల్పిస్తామన్న బొరగం
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం గణపవరం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరినట్టు నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు తెలిపారు. ఆయన సమక్షంలో పసుమర్తి భీమేశ్వరరావు, బొబ్బర ఎలీషా, దెర్శిపాము రామకృష్ణ, కొర్సా దుర్గారావు, కొర్సా వంశీ, చంపన నాగరాజు, చాప శివలతో పాటు ఇప్పటి వరకు వైసీపీకి మద్దతుగా ఉన్న 50 కుటుంబాల వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 

ఈ సందర్భంగా బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ, అందరికీ పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అందరూ కష్టపడి పనిచేసి టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి మండల టీడీపీ అధ్యక్షుడు మొగపర్తి సోంబాబు, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ తెలుగురైతు కార్యదర్శి గద్దె అబ్బులు, నియోజకవర్గ తెలుగు మహిళ కార్యదర్శి జారం చాందినీ సాగరిగ తదితరులు పాల్గొన్నారు.
Eluru District
Ganapavaram
Telugudesam
YSRCP

More Telugu News