Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ గా బాధ్యతలు అందుకున్న విజయసాయిరెడ్డి

Vijayasai Reddy has taken charge as Andhra Pradesh Basketball Association Chairman
  • ఇటీవల ఏపీబీఏ ఎన్నికలు
  • బాస్కెట్ బాల్ సంఘం చైర్మన్ గా విజయసాయి ఏకగ్రీవం
  • సంతోషంగా ఉందన్న విజయసాయి
  • బాస్కెట్ బాల్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి
వైసీపీ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఏపీబీఏ) చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. దీనికి సంబంధించిన వివరాలను విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో తెలిపారు. ఇటీవలే తాను బాస్కెట్ బాల్ సంఘం చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని విజయసాయి తెలిపారు. ఇవాళ జాతీయ క్రీడా దినోత్సవం అని, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ పదవీ బాధ్యతలు చేపట్టానని వెల్లడించారు. అందుకు ఎంతో సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. ఏపీలో బాస్కెట్ బాల్ క్రీడ సర్వతోముఖాభివృద్ధికి శక్తిమేర కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఫొటోలను కూడా పంచుకున్నారు.
Vijayasai Reddy
Chairman
APBA
Basketball
Andhra Pradesh
YSRCP

More Telugu News