'కోబ్రా'లో విక్రమ్ ఏ గెటప్పులో నచ్చారంటే .. : శ్రీనిధి శెట్టి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కోబ్రా'లో విక్రమ్ ఏ గెటప్పులో నచ్చారంటే .. : శ్రీనిధి శెట్టి

Cobra movie update
  • విక్రమ్ హీరోగా చేసిన 'కోబ్రా'
  • ఈ నెల 31వ తేదీన విడుదల 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్ 
  • విక్రమ్ తో చేయడం అదృష్టమన్న శ్రీనిధి     
'కేజీఎఫ్ 2' తరువాత శ్రీనిధి శెట్టి చేసిన సినిమాగా ఈ నెల 31వ తేదీన 'కోబ్రా' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించిన నిన్న హైదరాబాద్ లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ లో ఆమె మెరిసింది. అందరూ కూడా ఆమె ఇంగ్లిష్ లో మాట్లాడుతుందని అనుకున్నారు. కానీ ఆమె ఏకధాటిగా తెలుగులో మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయారు.

శ్రీనిధి మాట్లాడుతూ .. "కోబ్రా అనగానే నాకు విక్రమ్ సార్ గుర్తుకు వస్తారు. తమిళంలో నా మొదటి సినిమాను విక్రమ్ సార్ తో చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు.  ఇంత పెద్ద బ్యానర్లో  .. ఆయన కాంబినేషన్ లో చేసే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పాత్ర మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది" అని అన్నారు.    

విక్రమ్ సార్ .. ఈ సినిమాలో చాలా గెటప్పులలో కనిపిస్తారు .. కానీ ఆయన నా జోడీ కట్టిన గెటప్పు ఏదైతే ఉందో అదే నాకు నచ్చుతుంది. విక్రమ్ సార్ .. రెహ్మాన్ సార్ .. మా డైరెక్టర్ గారు .. మంచి కథ ఈ సినిమా హైలైట్స్ గా చెబుతాను. ఈ నెల 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తప్పకుండా చూడండి" అంటూ చెప్పుకొచ్చారు.   

Vikram
Srinidhi Shetty
Cobra Movie

More Telugu News