పాకిస్థాన్‌ను ముంచెత్తిన వరదలు.. 1000 మందికిపైగా మృతి
- గత 30 సంవత్సరాలలోనే ఎన్నడూ లేనంతగా వానలు
- కొట్టుకుపోయిన 149 వంతెనలు
- సాయం అందించేందుకు ముందుకొచ్చిన ఇరాన్, ఖతర్
వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీటమునిగాయి. దేశవ్యాప్తంగా 3.30 కోట్ల మందిపై వరదలు ప్రభావం చూపినట్టు పాకిస్థాన్ అంతర్గత మంత్రి రాణా సనావుల్లా తెలిపారు. వరద బాధితులకు సాయం అందించేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపినట్టు తెలిపారు. వర్షాల కారణంగా దేశంలోని 149 వంతెనలు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా అతలాకుతలం అవుతున్న పాకిస్థాన్‌కు ఆపన్న హస్తం అందించేందుకు ఖతర్, ఇరాన్‌తో పాటు మరికొన్ని దేశాలు ముందుకొచ్చాయి.