Vijay Devarakonda: ​దుబాయ్ లో దాయాదుల క్రికెట్ మ్యాచ్... స్టేడియంలో సందడి చేసిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda spotted at Dubai stadium during India and Pakistan match
  • ఆసియా కప్ లో తలపడుతున్న భారత్, పాకిస్థాన్
  • మ్యాచ్ చూసేందుకు వచ్చిన విజయ్ దేవరకొండ
  • ఇర్ఫాన్ పఠాన్ తో కలిసి మ్యాచ్ ను వీక్షిస్తున్న వైనం
  • కుర్తా, పైజమా డ్రెస్ లో లైగర్ హీరో
ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా విచ్చేశారు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తో కలిసి విజయ్ దేవరకొండ మ్యాచ్ ను వీక్షిస్తుండడం కెమెరాలకు చిక్కింది. మ్యాచ్ ఆరంభానికి ముందు టెలివిజన్ స్క్రీన్ పై సందడి చేశారు. స్టూడియోలో ఉన్న వ్యాఖ్యాతలతో ముచ్చటించారు. 
ఈ మ్యాచ్ కోసం విజయ్ దేవరకొండ కుర్తా, పైజామా డ్రెస్ ధరించి రావడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి. కాగా, విజయ్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం లైగర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్ డ్ టాక్ మధ్య ప్రదర్శితమవుతోంది.
Vijay Devarakonda
Dubai
Team India
Pakistan
Asia Cup
Cricket
Liger
Tollywood

More Telugu News