Indians: భారత పర్యాటకుల రాకతో పండుగ చేసుకుంటున్న అబుదాబి!

  • ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో భారతీయ పర్యాటకులే ఎక్కువ
  • 12.8 లక్షల మంది సందర్శించినట్టు ఖలీజ్ టైమ్స్ వెల్లడి
  • మరే దేశంతో పోల్చిచూసినా భారతీయులే అధికం
Indians visited Abu Dhabi way more than any other nationalities in first half of 2022

అబుదాబి ఇప్పుడు భారత పర్యాటకుల రాకతో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో అబుదాబిని సందర్భించిన పర్యాటకుల్లో అత్యధికులు భారత్ నుంచి వచ్చిన వారేనని ఖలీజ్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. 


అబుదాబి ఇంటర్నేషనల్, అల్ ఎయిన్ ఇంటర్నేషనల్, అల్ బటీన్ ఎగ్జిక్యూటివ్, డెల్మా, సర్ బాని యాస్ ఐలాండ్ విమానాశ్రయాలను 62.99 లక్షల మంది ప్రయాణికులు వినియోగించుకున్నారు. 2021 మొదటి ఆరు నెలలతో పోలిస్తే విమాన సర్వీసుల సంఖ్య 94 శాతం పెరిగింది. 

ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో భారత్ నుంచి 12.8 లక్షల మంది ప్రయాణికులు అబుదాబి విమానాశ్రయాలను వినియోగించుకున్నారు. పాక్ నుంచి 4.85 లక్షల మంది, బ్రిటన్ నుంచి 3.74 లక్షల మంది, సౌదీ అరేబియా నుంచి 3.33 లక్షల మంది, ఈజిప్ట్ నుంచి 2.83 లక్షల మంది ప్రయాణికులు అబుదాబికి విచ్చేశారు.

ఏప్రిల్-జూన్ వరకు మూడు నెలల గణాంకాలను చూసినా భారత్ నుంచి అత్యధికంగా 7.64 లక్షల మంది అబుదాబిని సందర్శించారు. పాకిస్థాన్ నుంచి 2.31 లక్షలు, బ్రిటన్ నుంచి 2.03 లక్షలు, సౌదీ అరేబియా నుంచి 1.95 లక్షల మంది వచ్చినట్టు డేటా తెలియజేస్తోంది.

More Telugu News