Sensex: ఈ వారాన్ని స్వల్ప లాభాలతో ముగించిన మార్కెట్లు

  • 59 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 36 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 2.80 శాతం పెరిగిన ఎన్టీపీసీ షేర్ విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని స్వల్ప లాభాల్లో ముగించాయి. ఈ ఉదయం ఉత్సాహంగానే ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే అంతర్జాతీయ సానుకూల సంకేతాలు మార్కెట్లకు అండగా నిలిచాయి. 

ఈ క్రమంలో చివర్లో మళ్లీ కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 59 పాయింట్ల లాభంతో 58,834కి చేరుకుంది. నిప్టీ 36 పాయింట్లు పెరిగి 17,559 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (2.80%), టైటాన్ (2.65%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.92%), కోటక్ బ్యాంక్ (1.71%), ఎల్ అండ్ టీ (1.47%). 

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.92%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.20%), ఏసియన్ పెయింట్స్ (-1.18%), భారతి ఎయిర్ టెల్ (-1.02%), డాక్టర్ రెడ్డీస్ (-0.45%).

More Telugu News